భవిష్యత్ మంచి రాజకీయ వ్యవస్థ ఏర్పాటుకు నేటి యువత, విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి పిలుపు నిచ్చారు.
శుక్రవారం మిడ్తూరు మండలం కలమందలపాడు గ్రామం 10వ తరగతి చదువుతున్న డి. మషీరా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన పాఠశాల విద్యార్థుల శాసనసభ నమూనా సమావేశంలో పాల్గొని నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అభినందనలు తెలిపి ఘనంగా సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చాంద్ బాషా, కలమందలపాడు స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ సైశావలి తదితరులు పాల్గొన్నారు.
Arattai