నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, నంద్యాల ఐఎంఏ,నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త సహకారంతో డిసెంబర్ మూడవ తేదీ స్థానిక ఎన్టీఆర్ పురపాలక టౌన్ హాల్ లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహిస్తున్నట్టు సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, అధ్యక్షులు ఎం.పీ.వి.రమణయ్య శనివారం సంఘం కార్యాలయంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో తెలిపారు.
వెయ్యి మంది పైగా దివ్యాంగులు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారని, వచ్చిన వారందరికీ నూతన వస్త్రాలు, అవసరమైన వారికి చక్రాల కుర్చీలు, మోటార్ తో పని చేసే కుట్టుమిషన్లు,వినికిడి యంత్రాలు, చంక కర్రలు, దివ్యాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు,ప్రత్యేక పాఠశాలల విద్యార్థులకు నిత్యావసర వస్తువుల కిట్లు దాతల సహకారంతో అందజేయడం జరుగుతుందని తెలిపారు.
హాజరైన వారికి ఓంకార క్షేత్రంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమం భోజన ఏర్పాట్లు చేశారని తెలిపారు.దివ్యాంగులకు సహకరించడానికి రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్.సి.సి.క్యాడేట్లు పాల్గొంటున్నారని వివరించారు.

రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎం.డి.ఫరూక్,అధికారులను, ఐఎంఏ, లయన్స్ క్లబ్ ప్రతినిధులను ఈ ఉత్సవంలో పాల్గొనాలని ఆహ్వానించినట్టుగా తెలిపారు.
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం లో పాల్గొనవలసిందిగా నంద్యాల ప్రాంతంలోని దివ్యాంగులను ఆహ్వానించారు.ఈ పాత్రికేయ సమావేశంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, అధ్యక్షులు ఎం.పీ.వి. రమణయ్య,ఉపాధ్యక్షులు వెంకటరావు,చలపతి,ప్రధాన కార్యదర్శి రామలింగం,కార్యాలయ కార్యదర్శి అలా మధు, సంయుక్త కార్యదర్శి ఇంతియాజ్, కార్యవర్గ సభ్యులు దుర్గారావు,వీర భరతుడు, కరీముల్లా పాల్గొన్నారు.
Arattai