నంద్యాల పట్టణం విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయం నందు ఈనెల16వ తేదిన ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.
విశ్వహిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు VHP జిల్లా ఉపాధ్యక్షులు వెంకటసుబ్బయ్య తెలిపారు.

ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ రామకృష్ణారెడ్డి,డాక్టర్ వంగాల అరుణ,డాక్టర్ గాండ్ల నరహరి,డాక్టర్ రామకృష్ణ వేణి లు ఈ శిబిరంలో వైద్య సేవలు అందిస్తారని వారు తెలిపారు.పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని సద్విని చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటసుబ్బయ్య,పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్,సుహాసిని,శేషసాయి,మురళీధర్ రెడ్డి,అనిల్ పాల్గొన్నారు
Arattai