NEW DELHI Dec 15:- న్యూ ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర ఐటీ శాఖ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ టీడీపీ పార్లమెంట్ సభ్యులతో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఇంటిలో లంచ్ మీటింగ్ నిర్వహించారు.

ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆహ్వానం మేరకు ఢిల్లీలోని ఆమె ఇంటికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు టీడీపీ పార్లమెంటు సభ్యులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఇంటికి రాగానే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మంత్రి నారా లోకేష్ తో పాటు తోటి పార్లమెంట్ సభ్యులకు సాధర స్వాగతం పలికారు.
ఢిల్లీలోని తన ఇంటిలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు, నాతోటీ ఎంపీ లకు భోజనానికి ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పారు.
Arattai