నంద్యాల పట్టణంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో మంగళవారం విశ్వహిందూ పరిషత్ సేవ విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ హోమియో వైద్యులు సాధారణ జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలు, అలెర్జీలు తదితర ఆరోగ్య సమస్యలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు పాటించాలని వైద్యులు సూచించారు.

ఈ వైద్య శిబిరంలో ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ రామకృష్ణారెడ్డి,డాక్టర్ వంగాల అరుణ,డాక్టర్ గాండ్ల నరహరి,డాక్టర్ రామకృష్ణ వేణి లు పాల్గొని వైద్య సేవలు అందించారు.
ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇటువంటి శిబిరాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షులు ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి మరియు ప్రాంత బజరంగ్దళ్ కన్వీనర్ పోలేపల్లి సందీప్ మరియు ప్రాంత విద్యార్థి సేవా ప్రముఖు కమ్మయ్య మరియు బజరంగ్దళ్ ప్రాంత సురక్ష ప్రముఖ శివకుమార్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ సి హెచ్ వెంకటసుబ్బయ్య మరియు నగర అధ్యక్షులు చంద్రశేఖర్ మరియు సుహాసిని తదితరులు పాల్గొన్నారు
Arattai