NANDYAL Dec 23:- మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మరియు చరణ్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని నంది రైతు సమాఖ్య ముఖ్య సలహాదారులు డా. రవీంద్రనాథ్ పేర్కొన్నారు.. రైతు సమాఖ్య కార్యాలయంలో మంగళవారం సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎంవి కృష్ణారెడ్డి అధ్యక్షతన మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు వర్ధంతి మరియు రైతు ఉద్యమ నేత చరణ్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ప్రధాని చరణ్ సింగ్, పీవీ నరసింహారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి సమాఖ్య సభ్యులు ఘనంగా నివాళులర్పించారు… కార్యక్రమంలో రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలతో భారతదేశానికి మంచి ప్రయోజనాలు అందించిన ప్రధానిగా నరసింహారావు చరిత్రలో నిలిచిపోయారన్నారు.. పార్లమెంట్ సభ్యులుగా నంద్యాలకు ప్రాతినిధ్యం వహించడం వల్ల నంద్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు.
అలాగే రైతు ఉద్యమ నేతగా గుర్తింపబడిన చరణ్ సింగ్ రైతు ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడన్నారు. వారి కృషికి గుర్తింపుగా ఆయన జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రైతు నాయకులు ఎన్జీరంగా చరణ్ సింగ్ తో కలిసి ఉద్యమాలు నిర్వహించిన విషయం గుర్తు చేశారు. వారి కృషితో పొగాకు లైసెన్స్ రద్దు, జమీందారీ విధానం రద్దు చేయడం జరిగిందన్నారు.

నేటి నాయకులు వారి స్ఫూర్తితో దేశ ప్రయోజనాల కోసం కృషి చేయాలని కోరారు.. రైతు దినోత్సవం సందర్భంగా ప్రకృతి వ్యవసాయంతో ముందుకు సాగుతుతూ ఆదర్శంగా నిలిచిన జిల్లెల్లకు చెందిన రైతు బాల మద్దిలేటిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సమాఖ్య కోఆర్డినేటర్ ఓబుళపతి మధుసూదన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి ,భాస్కర్ రెడ్డి, జయరాం రెడ్డి దంత వైద్యులు డాక్టర్ కిషోర్ కుమార్, మాధవస్వామి, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.
Arattai