క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్
AMARAVATHI:-దయా గుణాన్ని ఇతరులకు పంచడమే ఏసుక్రీస్తు సందేశమని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.క్రిస్మస్ పండుగ ప్రతీ ఒక్కరి ఇంటిలోనూ సంతోషాలు నింపాలని క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం అమరావతిలో ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రేమ, త్యాగానికి ప్రతీకైన ఏసుక్రీస్తు బోధనలు ప్రతీ ఒక్కరికీ అనుసరణీయమన్నారు. ప్రేమ, శాంతి, దయాగుణాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప మహనీయుడు ‘ఏసుక్రీస్తు’ అని అన్నారు.
ప్రతి ఒక్కరూ ప్రేమ, దయాగుణాన్ని కలిగి ఉండాలన్నారు. ప్రేమ, దయాగుణాన్ని ఇతరులకు పంచాలని క్రీస్తు ప్రజలకు బోధించడమే కాక, జీవించి చూపించారన్నారు. క్రైస్తవ సోదర, సోదరీమణులందరూ క్రిస్మస్ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకోవాలని మంత్రి ఫరూక్ ఆకాంక్షించారు.
పాస్టర్లకు గౌరవ వేతనం – వారి అకౌంట్లకు రూ.50 కోట్లు జమ పూర్తి
విజయవాడలోని ఏ-ప్లస్ కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం – మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తేనేటి విందు( హై టీ ) సెమీ క్రిస్మస్ వేడుకలు సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు మరుసటి రోజునే పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లింపు కోసం రూ. 50.04 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఉత్తర్వులు జారీ అయిన వెంటనే బుధవారం సాయంత్రానికి పాస్టర్ల అకౌంట్లకు గౌరవ వేతనం చెల్లింపు ప్రక్రియ కూడా ప్రభుత్వం పూర్తి చేసినట్లు మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రకటించిన మేరకు క్రిస్మస్ కు ముందు రోజే (24 వ తేదీ సాయంత్రం కు ) 12 నెలల గౌరవ వేతనం చెల్లించడం జరిగిందన్నారు.
2024 డిసెంబరు నుండి 2025 నవంబరు నెల వరకు, ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున 12 నెలల గౌరవ వేతనం 8427 మందికి, ఒక్కొక్క పాస్టర్ కు రూ. 60 వేలు క్రిస్మస్ పర్వదినం కు ముందే వారి అకౌంట్లకు జమ చేసి మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరూపించినట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.
Arattai