నంద్యాల పట్టణంలోని ప్రథమ నంది దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో అయోధ్య రామ మందిరం నమూనాను అత్యంత అద్భుతంగా రూపొందించారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా మందిరాన్ని నిర్మించారు.
ఈ నమూనా మందిరం లోపల బాల రాముని విగ్రహాన్ని శోభాయమానంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ రామ మందిర నమూనాను చూసిన భక్తులు, సందర్శకులు అపార ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయోధ్య రామ మందిరాన్ని తలపించేలా ప్రతి చిన్న అంశాన్ని కూడా ఎంతో నైపుణ్యంతో రూపొందించారని సందర్శకులు ప్రశంసిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ నంద్యాల పట్టణంలో భక్తి వాతావరణాన్ని మరింత పెంపొందిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఈ నెల 4వ తేదీ ఆదివారం నుండి ప్రారంభం

ఈ నెల 5వ తేదీ సోమవారం నుండి అయోధ్య రామ మందిరాన్ని పట్టణ పరిసర ప్రాంత ప్రజలు దర్శించుకోవచ్చని ఎగ్జిబిషన్ నిర్వాహకులు శ్రీనివాసులు తెలిపారు
Arattai