NANDYAL:-వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ డిస్ట్రిక్ట్(302 )గవర్నర్ గా నంద్యాల మండలం మునగాల గ్రామ మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి ఎంపికయ్యారు.. ఆదివారం పాణ్యం మండలం సుగాలిమెట్ట సమీపంలోని అర్బన్ ఫామ్స్ లో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పి . రవి రాజు గారు రామచంద్రారెడ్డి చే ప్రమాణ స్వీకారం చేయించారు… ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నంద్యాల ప్రాంతంలో వాకర్స్ అసోసియేషన్స్ సంఖ్యను పెంచడానికి కృషి చేస్తానన్నారు.

ఆరోగ్యానికి నడక ఉత్తమ సాధనమని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా నడక అలవాటుగా మార్చుకోవాలన్నారు.. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో 10 నూతన క్లబ్ లు ఏర్పాటు చేశామన్నారు.కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ సెక్రటరీ కోనేటి రవిరాజు , వాకర్స్ అసోసియేషన్ నంద్యాల నాయకులు చింతల మోహన్ రావు, డివి సుబ్బయ్య, లోకేశ్వర్ రెడ్డి, మహబూబ్ బాషా,అన్నెం శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు , జయపాల్, లాజర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Arattai