నంద్యాల పట్టణంలోని శ్రీ జగజ్జనని దేవాలయం నందు ఈనెల 23 నుండి 27 వరకు అమ్మవారి 17వ ప్రతిష్ట వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయం నిర్వాహకులు పుల్లయ్య తెలిపారు. శుక్రవారం వార్షికోత్సవా వేడుకల కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పుల్లయ్య మాట్లాడుతూ నంద్యాలలో ఉన్నటువంటి జగజ్జనని దేవాలయం ప్రపంచంలోనే 2వ దేవాలయం అని తెలిపారు.

23వ తేదీ సోమవారం గణపతి పూజ పుణ్యాహవచనం,కలిశ స్థాపన,అమ్మవారికి అభిషేకము,మహా మంగళహారతి,24వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల నుండి సహస్ర కలశ క్షీరాభిషేకం నిర్వహిస్తున్నామని, క్షీరాభిషేకం కొరకు భక్తులు తమ ఇంటి వద్ద నుండి ఆవుపాలు కలశాలలో తీసుకొని రావాలని తెలిపారు.25వ తేదీ బుధవారం ఉదయం సహస్రనామ కుంకుమార్చన, మహా మంగళహారతి 26వ తేదీ గురువారం ఉదయం ప్రభాత పూజ నవావరణ పూజా విధితో శ్రీ చక్రార్చన, మహా మంగళహారతి 27వ తేదీ శుక్రవారం ఉదయం ప్రభాత పూజ చండి హవనము, బలి ప్రదానము పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ ఐదు రోజుల వేడుకల్లో భక్తులు తమ ఇంటి వద్దనుండే గండాదిపం తీసుకొని అమ్మవారి సన్నిధికి తీసుకొని రావాలని కోరారు.మహిళలు సంప్రదాయ దుస్తులలో దేవాలయానికి రావాలని కోరారు.
Arattai