NANDYAL Feb10 :- ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో త్వరలో ప్రారంభించనున్న ప్రధానమంత్రి జన ఔషధీ మెడికల్ షాప్ ఏర్పాటు కోసం కొలిమిగుండ్లలోని రాంకో సిమెంట్స్ లిమిటెడ్ యాజమాన్యం రూ.3 లక్షల విరాళాన్ని అందజేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గారి సూచన మేరకు ఈ విరాళాన్ని అందజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
నిరుపేదలకు అతి తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి జన ఔషధీ మెడికల్ షాపులను ఏర్పాటు చేస్తుండగా, అందులో భాగంగా నంద్యాలలో ఈ మెడికల్ షాప్ను రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాంకో సిమెంట్స్ లిమిటెడ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కే. శోభన్ బాబు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారి సూచన మేరకు సామాజిక బాధ్యతలో భాగంగా ఈ విరాళాన్ని అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, కోశాధికారి నాగేశ్వరరావు, కలెక్టర్ కార్యాలయ ఏవో శుభకర్తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Arattai