NANDYAL Feb13:- శాంతిరామ్ ఇంజినీరింగ్ కళాశాల (అటానమస్)లో MBA విద్యార్థులకు, ఫైనాన్సియల్ విస్డం ఫర్ ఫ్యూచర్ బిజినెస్ లీడర్స్ (FINANCIAL WISDOM FOR FUTURE BUSINESS LEADERS) అను అంశంపై రెండు రోజులు (12.02.2025 మరియు 13.02.2026) వర్క్‌షాప్‌ను నిర్వహించారు, ఈ కార్యక్రమం ఆదిత్య బిర్లా ఫౌండేషన్ మరియు NISM అసోసియేషన్ తో నిర్వహించబడినది.SEB సెక్యూరిటీ మార్కెట్ ట్రైనర్. డాక్టర్ జె. మూర్తీ గారు ప్రధాన అతిథి మరియు రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించారు.

ఈ వర్క్‌షాప్ నందు పెట్టుబడి అంటే ఏమిటి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి ఉన్నప్పుడు పరిగణించవలసిన అంశాలు ఏమిటి, పెట్టుబడిలో నష్టాలు ఏమిటి, సెక్యూరిటీస్ మార్కెట్ ప్రాముఖ్యత, పెట్టుబడులలో జాగ్రత్తలు, మూలధన మార్కెట్లో అవకాశాలు, మరియు విద్యార్థులు అభ్యాసం చేయగలిగే రంగాలపై వివరణాత్మకంగా ప్రసంగించారు. MBA విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

విభాగాధిపతి డాక్టర్ ఎ కె నీరజా రాణి మాట్లాడుతూ – ఈ వర్క్‌షాప్, విద్యార్థులకు పెట్టుబడి రంగం పై విస్తృతమైన అవగాహన కల్పించిందని, విద్యార్థులలో ఆర్థిక జ్ఞానాన్ని పెంపొందించడంలో, పెట్టుబడులపై అవగాహనలో దోహదపడిందని తెలిపారు. విద్యార్థులకు సిద్దాంత జ్ఞానం మాత్రమే కాకుండా, ప్రాక్టికల్ అవగాహనకు కూడా ఇవి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
Arattai