ఏకశిలా ఆంజనేయస్వామికి మాఘ మాస అమావాస్య పూజలు
NANDYAL Feb17:- నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవలాపురం నందు వెలసిన ఏకశిలా అభయాంజనేయ స్వామికి మంగళవారం మాఘమాస అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శివరాజ్ యోగి, రవితేజలు మాట్లాడుతూ ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన వారం మంగళవారం అని, మంగళవారం అమావాస్య రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు.ఉదయం నుంచి ఏకశిలా అభయాంజనేయ స్వామికి ఆకు పూజలు, అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు.సాయంత్రం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, అర్ధరాత్రి 2 గంటలకు మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
Arattai