NANDYAL Feb 27:- భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు 2002 SIR ఓటర్లను 2025 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం సూచనల మేరకు, ఓటర్ల సంతానం వివరాలతో సహా మ్యాపింగ్ ప్రక్రియను సమయానుకూలంగా పూర్తి చేయాలని, BLO యాప్లో అందుబాటులో ఉన్న నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.
ఈ నేపథ్యంలో మ్యాపింగ్ పురోగతిని వేగవంతం చేయడానికి ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, ఎలక్షన్ డీటీలు, బీఎల్ఓ సూపర్వైజర్లు మరియు బీఎల్ఓలు ఓటర్ల మ్యాపింగ్ పురోగతిని సమీక్షించి, 2026 మార్చి 15 నాటికి గరిష్ట శాతం మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించామన్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో క్రింది తేదీలలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.
28 ఫిబ్రవరి 2026 (శనివారం)
1 మార్చి 2026 (ఆదివారం)
7 మార్చి 2026 (శనివారం)
8 మార్చి 2026 (ఆదివారం)
ప్రత్యేక శిబిరాల సమయంలో ఓటర్లు తమ వివరాలను సరిచేసుకోవడం, సంతానం వివరాలను నమోదు చేయడం, పేరు చేర్పు/తొలగింపు/సవరణలకు సంబంధించిన అభ్యర్థనలు సమర్పించుకోవడం వంటి సేవలను పొందవచ్చని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఓటరు జాబితా శుద్ధి మరియు మ్యాపింగ్ ప్రక్రియలో సహకరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు.
Arattai