NANDYAL:-నంద్యాల జిల్లా బనగానపల్లె లో వెటర్నరీ అసిస్టెంట్ గా పనిచేస్తున్న దివ్యాంగ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు హిమ గణేష్ విజయనగరంలో జరిగిన రాష్ట్రస్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలలో నంద్యాల జిల్లా తరపున పాల్గొని విజేతగా నిలిచి, హైదరాబాదులో ఆరవ తేదీ నుండి జరగనున్న ఏడవ జాతీయస్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలలో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొనడానికి ఎంపికయ్యాడు
ఈ సందర్భంగా నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, కార్యదర్శి ఎం.పి.వి. రమణయ్య హిమ గణేష్ ను శాలువా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ గణేష్ జాతీయ స్థాయి పోటీలలో కూడా విజేతగా నిలిచి రాష్ట్రానికి, నంద్యాల జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. దివ్యాంగులు క్రీడలలో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ను సంప్రదించాలని కోరారు. క్రీడలలో దివ్యాంగులను ప్రోత్సహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎంపీ వి రమణయ్య,కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి, సినీ, టీవీ నటులు ఎస్.ఆర్.ఎస్.ప్రసాద్, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అశోక్ కుమార్ యాదవ్, కళారాదన కార్యవర్గ సభ్యుడు శివరామిరెడ్డి, కార్యాలయ కార్యదర్శి ఆలా మధు పాల్గొన్నారు.
Arattai