NANDYAL :- ఈనెల 22వ తేదీన నంద్యాల పట్టణంలోని ప్రధమ నందీశ్వర స్వామి దేవస్థానం కళ్యాణమండపం నందు సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో బాలమేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈనెల 22వ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు ప్రథమనంది,వైయస్సార్ కళ్యాణ మండపం నందు సంఘమిత్ర అభ్యాసికల బాలమేళా వార్షికోత్సవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి సకుటుంబంగా విచ్చేయవలసినదిగా కోరారు. సంఘమిత్రకు సహాయ సహకారాలతో, అండదండలతో, ఆదరాభిమానాలతో అభిమానిస్తున్న దాతలకు, శ్రేయోభిలాషులకు ఇవే మా సంఘమిత్ర కార్యవర్గ సహృదయంగా ఆహ్వానిస్తున్నదనీ తెలిపారు.నంద్యాలలో సంఘమిత్ర సేవా సమితి నిరాశ్రీత బాలల ఆవాసము ఉచిత విద్యా గృహము చెంచుల కోసం IMA డాక్టర్స్ మహిళా విభాగం సహాయ సహకారాలతో సంచార వైద్యశాల, పర్యావరణ సమాజ శ్రేయస్సు కోసం ప్లాస్టిక్ వాడడం నిరోధించడం లో భాగంగా, “పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత” భాగంలో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేయడం, ఉపేక్షిత బస్తీలలో అభ్యాసి గల పేరుతో విద్యా, వైద్యం, ఆరోగ్య అవగాహన, సంస్కృతి, సాంప్రదాయాల మీద ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నదనీ తెలిపారు. ఉపేక్షిత బస్తీలలో నివసించే పిల్లలను, మంచి పౌరులుగా తీర్చిదిద్ది, భరతమాత సేవలో పాలు పంచుకోవాలన్నదే సంఘమిత్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు
ఈ కార్యక్రమంలో సంఘమిత్ర అధ్యక్షులు చిలుకూరి శ్రీనివాస్,ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వర్లు , ఉపాధ్యక్షులు,కే.మహేశ్వర రెడ్డి ,ప్రధాన కార్యదర్శి కర్నాటి నాగ సుబ్బారెడ్డి ,సహ కార్యదర్శి కరణం సుందర రావు ,సంఘటన కార్యదర్శి సిరిగిరి జయశ్రీ, సభ్యులు డివి అశోక్ కుమార్ , వెంకటేశ్వరమ్మ , వి వెంకట రమణయ్య ,ఎం రామాంజనేయులు,ప్రచార ప్రముఖ్ చింతలపల్లి వాసు పాల్గొన్నారు
Arattai