NANDYAL Mar21 :- నంద్యాల పట్టణంలో శనివారం ప్రపంచ కవితా దినోత్సవాన్ని సాహితీ స్రవంతి, మిడ్ టౌన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు

విత్వం సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తిగా, భావోద్వేగాలను ప్రతిబింబించే అద్దంలా ఉంటుందని సాహితీ స్రవంతి , మిడ్ టౌన్ రోటరీ క్లబ్ అధ్యక్షులు యం.శ్రీనివాసమూర్తి, కేశవమూర్తి అన్నారు.సాహితీ స్రవంతి, మిడ్ టౌన్ రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాలలోని వివేకానంద ఆడిటోరియంలో శనివారం ప్రపంచ కవితా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాహిత్య ప్రస్థానం ఉగాది ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ కవిత్వం అనేది మనసులోని భావాలకు అక్షరరూపం. వేమన, శ్రీశ్రీ, గురజాడ అప్పారావు వంటి మహాకవులు తమ కవిత్వం ద్వారా సమాజాన్ని మేల్కొలిపారన్నారు. ముఖ్య అతిథి, కళారాధన ప్రధాన కార్యదర్శి డా.రవికృష్ణ మాట్లాడుతూ కవిత్వం మనలో ఆలోచనను పెంచుతుంది. జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు కవిత్వం దారి చూపిస్తుందన్నారు. ఆత్మీయ అతిథి, కాపు కమీషన్ మాజీ చైర్మన్ వెదుళ్ళ రామచంద్రరావు మాట్లాడుతూ నేటి కవులు సామాన్య ప్రజల పక్షం వహించి వారి సమస్యలను తమ కవిత్వం ద్వారా లేవనెత్తాలన్నారు.

సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శి డా.నీలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాజాన్ని మేల్కొలిపే శక్తి కవిత్వానికి ఉందన్నారు.

మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతు కవులు తమ కవిత్వం ద్వారా సమాజంలో ప్రేమ, శాంతి, మానవతా విలువలను విస్తరించటానికి కృషిచేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం అందుకున్న చిన్నయసూరి సాహితీ సమితి అధ్యక్షులు, సరసకవి బిరుదాంకితులు డా.వైష్ణవ వేంకటరమణమూర్తిని సూరన సాహితీ సమితి అధ్యక్షులు డా.గెలివి సహదేవుడు, కేశవమూర్తి, వెంకటేశ్వర్లు ఘనంగా సత్కరించారు.

ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కవిసమ్మేళనంలో కవులు గంగుల నాగరాజు, నీలకంఠమాచారి,కొప్పుల ప్రసాద్ , మాబుబాష,డా.కిశోర్ కుమార్ ,రఫి,నరేంద్ర,గద్వాల రామకృష్ణ, లలితా సరస్వతి పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయ సంక్షోభం, మానవసంబంధాలు,శ్రామీక జీవితం వంటి సామాజిక అంశాలపై వినిపించిన కవితలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు కవులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివి సుబ్బయ్య, బాలరాజు, రమేష్ , రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
Arattai