NANDYAL : నంద్యాల పట్టణంలోని ప్రధమ నంది దేవస్థానం నందు ఈనెల 29వ తేదీ ఆదివారం ఉదయం 9:30 లకు దేవాలయ స్వయం ప్రతిపత్తి కోసం తయారైన ముసాయిదా బిల్లుపై జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కిషోర్ కుమార్ తెలిపారు
ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ జిల్లా లోని అన్ని దేవాలయాల నిర్వాహకులు, న్యాయవాధులు, వంశపారాంపర్య ధర్మకర్తలు, పూజ్య స్వామీజీ లు, పంచాంగ కర్తలు, వాస్తు, ఆగమ పండితులు, అర్చకులు పురోహితులు మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్లు తదితర మేధావులు అందరూ ఈ సదస్సుకు హాజరుకావాలని కోరారు.
ముసాయిదా బిల్లును క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఆ విషయాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి ఒక ఉద్యమ రూపం ను తీసుకువచ్చి ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి దేవాలయాలను విముక్తం చేసే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కిషోర్ కుమార్ నగర అధ్యక్షురాలు సుహాసిని రెడ్డి జిల్లా అర్చక ప్రముఖ సుధీంద్ర చార్యులు బజరంగ్దళ్ కార్యకర్తలు శివ, మురళి పాల్గొన్నారు
Arattai