NANDYAL May04 :- నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం అన్నప్రసాద వితరణ చేసినట్లు లయన్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో వచ్చు పేషెంట్ల సహాయకులకు అన్నదాన వితరణ చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం కీర్తిశేషులు చందా లక్ష్మీదేవి వర్ధంతి సందర్భంగా కుమారుడు చంద్రమోహన్ భార్య కృష్ణవేణి కుటుంబ సభ్యుల సహకారంతో అన్న ప్రసాద వితరణ నిర్వహించామన్నారు.
నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దూరప్రాంతాల నుంచి వైద్యం కొరకు ఎంతోమంది వస్తుంటారని వారికి ప్రత్యనిత్యం అన్నదానం దాతల సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ చంద్రమోహన్, ఇమ్మడి రామకృష్ణుడు , లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎస్ నాగరాజు, ట్రెజరర్ జనార్ధన్, లయన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Arattai