NANDYAL June13:- నంద్యాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం APUS జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్ శ్రావణ్ కుమార్ రాష్ట్ర సహకోశాధికారి ఏ కృష్ణార్జున్ రెడ్డి .ప్రధాన కార్యదర్శి పి వెంకటేశ్వర్లు రాష్ట్ర మహిళా కార్యదర్శి జి మాధవి లత వివిధ మండలాల మండల అధ్యక్షులు కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఇన్ సర్వీస్ టీచర్లకు TET పరీక్ల మినహాయించాలని ,సిపిఎస్ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ వర్తింపజేయాలని, వెంటనే నూతన పిఆర్సి కమిషన్ నియమించాలని,మధ్యంతర భృతి ప్రకటించాలని పెండింగ్ డీఏలను విడుదల చేయాలని,గత సంవత్సరం ఉపాధ్యాయ బదిలీల చట్టం చేసిన నేపథ్యంలో కచ్చితంగా ఈ సంవత్సరము ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టాలని,ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ ఈ సంవత్సరం నిలుపదల చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
Arattai