NANDYAL June 16:- ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహించబోయే రాష్ట్రస్థాయి చెస్ పోటీలలో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక కోసం నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 19 వ తేదీ , శుక్రవారం ఉదయం 9 గంటల నుండి శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల స్వామి వివేకానంద ఆడిటోరియం లో నంద్యాల జిల్లా స్థాయి అమెచ్యూర్ చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని నంద్యాల జిల్లా చెస్ అధ్యక్షులు, ఆంధ్ర చెస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ డాక్టర్. జి. రవికృష్ణ, కార్యదర్శి రామసుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈనెల 18 వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ఏపీ చెస్ వెబ్సైట్లో ఎంట్రీలు నమోదు చేసుకోవాలని నంద్యాల జిల్లా ఎంపికైన క్రీడాకారులు త్వరలో జరగబోవు రాష్ట్రస్థాయి చదరంగా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంట్రీలు నమోదు చేసుకోవడానికి,ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 9010451585.
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.
Arattai