NANDYAL June22 :- రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన యోగా షార్ట్ ఫిలిం పోటీల్లో నంద్యాల జిల్లాకు ద్వితీయ స్థానం లభించింది. ఈ సందర్భంగా విజేతలకు నిర్వహించిన కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
బనగానపల్లెకు చెందిన యోగా ట్రైనర్ తిరుమలయ్య రూపొందించిన “యోగబాట” అనే షార్ట్ ఫిలిం ఈ ఘనతను సాధించింది. ప్రేమ, మత్తు, చదువుపై అశ్రద్ధ వంటి సమాజంలో యువత ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సమస్యలను కథాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ షార్ట్ ఫిలింలో యోగా ద్వారా వ్యక్తిగత క్రమశిక్షణ, మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చని చూపించారు. అలాగే జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు యోగానే సమగ్ర పరిష్కార మార్గం అనే సందేశాన్ని ప్రేక్షకులకు అందించారు.

నంద్యాల జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన యోగా ట్రైనర్ తిరుమలయ్యను యోగా గురువులు, క్రీడా ప్రేమికులు, పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ విజయం జిల్లాలో యోగా ప్రచారానికి మరింత ఊతమిస్తుందని వారు పేర్కొన్నారు.
Arattai