NANDYAL July01 :- నంద్యాలలోని తెలుగు గంగ ప్రాజెక్టు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించిన విద్యపతి ధనుంజయ శర్మ పదవీ విరమణ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి అధికారులు, సహచర ఉద్యోగులు హాజరై ఆయనను శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ధనుంజయ శర్మ 32 సంవత్సరాల పాటు అంకితభావంతో విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందారని కొనియాడారు. క్రమశిక్షణ, నిజాయితీ, సేవా దృక్పథంతో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. తెలుగు గంగ ప్రాజెక్టుకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.పదవీ విరమణ అనంతరం ధనుంజయ శర్మ శేష జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖసంతోషాలతో కొనసాగాలని అధికారులు, సహచర సిబ్బంది ఆకాంక్షించారు.
Arattai