జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్ కిషోర్ కుమార్ కి ఘన సత్కారం
NANDYAL July01 :- నంద్యాల పట్టణంలో నంది రైతు సమాఖ్య అధ్యక్షులు బిక్కం రామ సుబ్బారెడ్డి అధ్యక్షతన జాతీయ వైద్యుల దినోత్సవం బుధవారం సమాఖ్య కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మూడు దశాబ్దాలుగా డాక్టర్ కిషోర్ కుమార్ సేవలు వైద్య,సాహిత్య రంగంలో నిరంతరాయంగా కొనసాగుతున్నాయని కొనియాడారు. వారి సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త రవీంద్రనాథ్, మాధవ స్వామి ,ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, కోఆర్డినేటర్ ఓబుళపతి, అధ్యాపకులు ఎం.ఎండి రఫీ. భారతి సీడ్స్ కార్యాలయ సిబ్బంది శ్రీనివాసరెడ్డి, హుస్సేనీ, బాలచంద్రుడు, డాక్టర్ కిషోర్ కుమార్ ని ఘనంగా సత్కరించారు.
Arattai