NANDYAL :- ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, నంద్యాల జిల్లా సంఘం నిర్వహణలో ఈనెల 18, 19వ తేదీలలో నంద్యాల ఎస్బిఐ కాలనీలో ఉన్న రామకృష్ణ పిజి కళాశాలలో రాష్ట్రస్థాయి సీనియర్ చెస్ పోటీలు నిర్వహిస్తున్నామని నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ, కార్యదర్శి రామ సుబ్బా రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. రాష్ట్రం లోని అన్ని జిల్లాల నుండి ఎంపికైన క్రీడాకారులు పాల్గొంటున్నారు.నంద్యాలలో జరుగుతున్న సీనియర్ చెస్ పోటీలలో విజేతలుగా నిలిచిన వారు జాతీయ స్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొంటారు.
నంద్యాలలో జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్ చెస్ పోటీలలో,ఆసక్తి ఉన్న చెస్ క్రీడాకారులు పాల్గొనాలని ఆహ్వానించారు.ఏపీ చెస్ వెబ్సైట్ ద్వారా క్రీడాకారులు ఈనెల 17 వ తేదీ సాయంత్రం లోపు ఎంట్రీలు నమోదు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు 9010451585 నెంబర్ ను సంప్రదించాలి.
Arattai