ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కాంట్రాక్ట్ అధ్యాపకుల రెన్యువల్ నోటిఫికేషన్
NANDYAL July16 :- కమిషనర్ రేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేసే కాంట్రాక్ట్ అధ్యాపకులకు 2026 – 27 అకాడమిక్ ఇయర్ సంబంధించి రెన్యువల్ కొరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టు లెక్చరర్స్ కౌన్సిలింగ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈనెల 24వ తేదీ లోపల ఐడి కళాశాల నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతుంది కావున గత సంవత్సరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 30-04- 2026 తేదీ వరకు పని చేసిన వారు ప్రస్తుతం పని చేస్తున్న లేదా పనిచేసిన డిగ్రీ కళాశాలలో ఈనెల 18వ తేదీ లోపల రెన్యువల్ కొరకు దరఖాస్తు ఫారం తో పాటు పదవ తరగతి మార్కుల జాబితాను అటేష్టిడ్ చేసిన కాపీని జతపరిచి దరఖాస్తు చేసుకోవాలని నంద్యాల జిల్లా ఐడి కళాశాల అయినా నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ శశికళ తెలిపారు
Arattai