నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న ఉద్యోగ మేళా
NANDYAL Sep22 :-నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ (JKC)ఆధ్వర్యంలో ఈ నెల 23న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లుకళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.ఈ ఉద్యోగ మేళాలో వివిధ రంగాలకు చెందిన 10 ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.

ఈ ఉద్యోగ మేళాలో వివిధ రంగాలకు చెందిన 10 ప్రముఖ సంస్థలు పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని తెలిపారు.ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్,ప్రీమియర్ ఎనర్జీస్,అపోలో ఫార్మసీ, హెటెరో ఫార్మాస్యూటికల్స్,జయలక్ష్మి మేనేజ్మెంట్ సర్వీసెస్, డీపీ చాక్లెట్స్, డిక్సన్ ల్యాప్టాప్స్, ముత్తూట్ మైక్రోఫిన్,టాటా ఎలక్ట్రానిక్స్ ,ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థలు నియామక ప్రక్రియలో పాల్గొననున్నాయని తెలిపారు.పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ,డిప్లొమా,డిగ్రీ,బీటెక్, ఎంఎస్సీ,ఫార్మసీ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు వారి అర్హతలకు అనుగుణంగా ఉత్పత్తి విభాగం,అసెంబ్లీ ఆపరేటర్,నాణ్యత నియంత్రణ,ఫార్మసీ,ఇంజినీరింగ్,శిక్షకులు,ఉపాధ్యాయులు,అకౌంటెంట్,పరిపాలన,మార్కెటింగ్, సాంకేతిక ఆపరేటర్,సంబంధాల అధికారి తదితర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.ఉద్యోగం మరియు విద్యార్హతలను బట్టి నెలకు రూ.14,000 నుంచి రూ.25,000 వరకు వేతనం లభించడంతో పాటు కొన్ని ఉద్యోగాలకు భవిష్య నిధి,బోనస్,భోజనం,రవాణా,వసతి,షిఫ్ట్ భత్యం వంటి అదనపు సౌకర్యాలు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.నంద్యాల,కర్నూలు,కడప, హైదరాబాద్,విశాఖపట్నం,నెల్లూరు (నాయుడుపేట), శ్రీకాళహస్తి,శ్రీ సిటీ,హోసూర్ తదితర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు.అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 23న తమ బయోడేటాతో ఉద్యోగ మేళాకు హాజరు కావాలని JKC కోఆర్డినేటర్ రమేష్ కుమార్ తెలిపారు.మరిన్ని వివరాల కోసం 7799337695,9703377803 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.ఈ ఉద్యోగ మేళాను జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు మరియు నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.
Arattai