నంద్యాలలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
NANDYAL Aug09:- నంద్యాలలోని హరిజనపేటలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని వహించినట్లు VHP పట్టణ అధ్యక్షురాలు సుహాసిని రెడ్డి తెలిపారు.ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు గ్యాస్ట్రో డాక్టర్ నీలా ప్రసాద్,ఆర్థోపెడిక్ డాక్టర్ క్రాంతి కుమార్ పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు.ఉచితంగా మందుల అందజేశారు.పేద,మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం ఆనందంగా ఉందని వైద్యులు,నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహ కార్యదర్శి నాగిరెడ్డి, విశేష సంపర్క ప్రముఖ్ శేషసాయి, డా లలిత సరస్వతీ , నరాల అరుణ , సుకుమాంబ , సేవా విభాగం సభ్యులు గురవయ్య ,శివ శంకర్ రెడ్డి, ఆదినారాయణ, చింతలపల్లి వాసు, మురళీధర్ రెడ్డి , నరసింహ, లక్ష్మీ నరసింహ , రవి , గౌతమ్ , సుబ్బు తదితరులు పాల్గొన్నారు.
Arattai