ఉద్యోగ మేళాలో106 మంది ప్రభుత్వ కళాశాల విద్యార్ధులు ఎంపిక
NANDYAL April 04:- నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉద్యోగ మేళా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.ఈ మేళాలో10 కంపెనీల ప్రతినిధులు విద్యార్ధుల నైపుణ్యాలను పరిశీలించి,మొత్తం 106 మంది విద్యార్ధులను ఎంపిక చేసినట్లు తెలిపారు.JKC మరియ APSSDC వారి సహకారంతో డిగ్రీ చివరి సంవత్సరం చదువుచున్న విద్యార్ధుల కోసం ఈ మేళా నిర్వహించినట్లు తెలిపారు
Arattai