NANDYAL July03:- నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నంద్యాల ఆర్ టి సి బస్టాండ్ లో దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం చక్రాల కుర్చీ అందజేశారు.
నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని నంద్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ మాధవి లతకు వీల్ చైర్ ను అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల సౌకర్యార్థం సహకారం అందిస్తామని అన్నారు. గత వారం రైల్వే స్టేషన్ కు రెండు చక్రాల కుర్చీలు అందజేశామని గుర్తు చేశారు.

లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశుల నాగరాజు మాట్లాడుతూ 2025- 26 సంవత్సరంలో దాదాపు 200 సేవా కార్యక్రమాలు నిర్వహించామని చివరి కార్యక్రమం గా దివ్యాంగులకు, వృద్ధులకు ఉపయోగపడే సేవా కార్యక్రమం చేయడం సంతోషాన్ని కలిగించింది అన్నారు.ఆర్టీసీ డిపో మేనేజర్ మాధవి లత మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వీల్ చైర్ అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. లయన్స్ క్లబ్ సేవా దృక్పథాన్ని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ కిషోర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ భాస్కర్, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డీ.కే. మూర్తి, నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు సుబ్బరాజు, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సోమేశుల నాగరాజు, తాతి రెడ్డి భాస్కర్ రెడ్డి, కోశాధికారి అమిదేల జనార్ధన్, జోనల్ చైర్మన్ నిజాముద్దీన్, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు ఎం.పీ.వి.రమణయ్య, నూతన అధ్యక్షులు గా ప్రమాణ స్వీకారం చేయనున్న సందీప్, సీనియర్ సభ్యులు యూసఫ్ పాల్గొన్నారు.
Arattai