NANDYAL July05 :- నంద్యాల లయన్స్ క్లబ్ 2026- 27 వ సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు విశిష్ట అతిధులుగా పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ జిల్లా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్. జి.రవి కృష్ణ నూతన కార్య వర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.నూతన అధ్యక్షులుగా సందీప్,కార్యదర్శిగా మేడా చంద్రశేఖర్,కోశాధికారిగా సురేష్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.వివిధ పదవులకు,వివిధ కార్యక్రమాల సబ్ కమిటీ చైర్మన్ లుగా పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.కొత్తగా లయన్స్ క్లబ్ లో చేరిన సభ్యులతో డాక్టర్ సహదేవుడు సభ్యత్వ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి, వెదుర్ల రామచంద్రరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు సేవా తత్పరతతో, అంకితభావంతో, నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఆరోగ్య రక్షణ, విద్యా, స్వయం ఉపాధి కార్యక్రమాలు ప్రధాన ధ్యేయంగా లయన్స్ క్లబ్ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం కూడా ప్రజలకు నిరంతరం విస్తృత సేవా కార్యక్రమాలు నూతన కార్యవర్గం నిర్వహించాలని కోరారు.

డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ 206 దేశాలలో, 50 వేల క్లబ్ లలో 14 లక్షల మంది పైగా లయన్స్ సభ్యులతో అంతర్జాతీయ లయన్స్ క్లబ్ సేవా సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. “సర్వేజనా సుఖినోభవంతు” అని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని, “పరోపకారార్ధం ఇదం శరీరం” అని ఇతరులకు సేవ చేయడం కోసమే మానవ జన్మ అని చాటిచెప్పిన భారతీయ సంస్కృతి అందించిన సేవా స్ఫూర్తితో నంద్యాల లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు 56 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని తెలిపారు.

నూతన అధ్యక్షుడు సందీప్,కార్యదర్శి మేడా చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే రీతిలో వివిధ సేవా కార్యక్రమాలను ఈ సంవత్సరం చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని,నంద్యాల లయన్స్ క్లబ్ పేరు ఇనుమడింప చేస్తామన్నారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గం అతిధులు డాక్టర్ రామకృష్ణారెడ్డి వెదుర్ల రామచంద్రరావు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ సహదేవుడు,గత సంవత్సరం అధ్యక్ష కార్యదర్శులు గా సేవలు అందించిన సోమేశుల నాగరాజు, తాతి రెడ్డి భాస్కర్ రెడ్డి,కోశాధికారి అమిదేల జనార్ధన్, రీజియన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, జోనల్ చైర్మన్ నిజాముద్దీన్ లను ప్రత్యేక జ్ఞాపికలు,శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, జోనల్ చైర్మన్ నిజాముద్దీన్ నంద్యాల లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు ఆంజనేయులు గుప్తా,రవి ప్రకాష్,భవనాసి నాగ మహేష్,కశెట్టి చంద్రశేఖర్,కశెట్టి వేణుమాధవ్, మహేశ్వర రెడ్డి, కన్నయ్య అధిక సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు కుటుంబాల తో పాటు పాల్గొన్నారు.
Arattai