NANDYAL June 03:- నంద్యాల జిల్లా డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20.04.2026 తేదిన వేకువ జామున సుమారు 03.30 గంటలకు జరిగిన ఐటీసీ సిగరెట్ గోడౌన్ లో చోరీ చేసిన సిగరెట్ ల కేసును డోన్ టౌన్ పోలీసులు మరియుCCS నంద్యాల పోలీసులు చేధించారు.

అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను బుధవారం డోన్ పట్టణం వెలుపల గుత్తి రోడ్ కు పోవుదారిలో ఉన్న రుద్రాక్ష గుట్ట ప్రక్కన అరెస్ట్ చేశారు.

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు మరియు డోన్ P.శ్రీనివాస్ ఆధ్వర్యంలో డోన్ టౌన్ యూపీఎస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇంతియాజ్ బాష అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, సీసీఎస్ నంద్యాల ఇన్స్పెక్టర్ శ్రీ పి. సురేష్ కుమార్ సహకారంతో ప్రత్యేక పోలీసు బృందంగా ఏర్పడి రాబడిన సమాచారం మేరకు డోన్ పట్టణం వెలుపల గుత్తి రోడ్డులోని రుద్రాక్ష గుట్ట సమీపంలో DL1CQ9769 నంబరు గల మారుతి సుజుకి స్విఫ్ట్ కారులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా, వారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులని వెల్లడైంది వారిని అరెస్ట్ చెయ్యడం జరిగిందని తెలిపారు

విచారణలో నిందితులు తమ మరో సహచరుడుతో కలిసి 20.04.2026 తేదీన డోన్ టౌన్‌లోని ఐటీసీ సిగరెట్ గోడౌన్లో చోరీ చేసి భారీ మొత్తంలో సిగరెట్ కార్టన్లను అపహరించినట్లు అంగీకరించనట్లు తెలిపారు.అనంతరం ఆ సొత్తును హైదరాబాద్‌లో విక్రయించి పొందిన నగదును తమ వద్దే ఉంచుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా కడప పట్టణంలో కూడా ఇదే తరహా నలుగురు చోరీలకు పాల్పడినట్లు వెల్లడించనట్లు తెలిపారు.
రాజేంద్రకుమార్ నంది న్యూస్ రిపోర్టర్
Arattai