NANDYAL July06 :- ప్రజా పరిష్కార వేదిక ద్వారా స్వీకరిస్తున్న ప్రతి అర్జీని నాణ్యతతో సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం డిఆర్ఓ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పిజిఆర్ఎస్ నోడల్ ఆఫీసర్ ఉమామహేశ్వరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ప్రజా పరిష్కార వేదిక (గ్రీవెన్స్ డే) ద్వారా ప్రజల నుండి స్వీకరిస్తున్న ప్రతి అర్జీని అత్యంత నాణ్యతతో, అర్జీదారుడు పూర్తిగా సంతృప్తి చెందేలా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు కేవలం అర్జీలను క్లోజ్ చేయడం కోసం కాకుండా, సమస్య మూలాల్లోకి వెళ్లి అర్జీదారుడు మెచ్చేలా, శాశ్వత పరిష్కారం చూపేలా నాణ్యతతో పని చేయాలన్నారు.

గతంలో పరిష్కారమయ్యాక కూడా దరఖాస్తుదారులు అసంతృప్తితో మళ్లీ సమర్పించిన (రీఓపెన్) అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, అవి పదే పదే రీఓపెన్ కాకుండా తగిన కృషి చేయాలన్నారు. ప్రతి అర్జీకి నిర్దేశించిన కాలపరిమితి లోపే నాణ్యమైన రీతిలో పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, అర్జీదారులకు జవాబుదారీతనంతో సేవలు అందించాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఒక్క అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిఆర్ఓ స్పష్టం చేశారు.

రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 177 అర్జీల స్వీకరణ
భూ సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని డిఆర్ఓ తెలిపారు. ఈ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా మొత్తంగా 177 దరఖాస్తులు స్వీకరించగా వాటిలో రెవెన్యూ, గ్రామ/వార్డు సచివాలయ సేవలకు సంబంధించినవి 3, అడంగల్ సవరణలకు సంబంధించినవి 5, చుక్కల భూముల క్రమబద్ధీకరణ, 22-ఎ భూములకు సంబంధించినవి 12, అసైన్డ్ భూములు, భూ ఆక్రమణలకు సంబంధించినవి 50, రెవెన్యూ కోర్టు విచారణలు/ఆర్ఓఆర్కు సంబంధించినవి 73, సర్వే, రీ-సర్వేలకు సంబంధించినవి 31, దేవాదాయ, వక్ఫ్ భూములకు సంబంధించినవి 3గా ఉన్నాయని డిఆర్ఓ వివరించారు.

Arattai