NANDYAL July07 :- జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఎంపిక చేసిన ఐదు మంది వైద్యులకు లయన్స్ క్లబ్ వైద్యుల దినోత్సవ పురస్కారాలను అందజేసి ఘనంగా సత్కరించారు.నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్ అధ్యక్షతన, సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు కుంచా మహేశ్వరరెడ్డి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ అలీ భాషా, ప్రముఖ ఎముకలు కీళ్ల శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి,డాక్టర్ ఉయ్యాలవాడ శ్రీధర్ రెడ్డి, ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ కామిని నాగార్జున, ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ గురు ప్రసాద్ లకు లయన్స్ క్లబ్ వైద్యుల దినోత్సవం పురస్కారాలను అందజేసి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి,వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ,ఈ కార్యక్రమానికి సహకరించిన కుంచా మహేశ్వరరెడ్డి,లయన్స్ క్లబ్ కార్యదర్శి మేడా చంద్రశేఖర్, కోశాధికారి సురేష్,సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు, రీజనల్ చైర్మన్ పీవీ సుధాకర్ రెడ్డి, జోనల్ చైర్మన్ నిజాముద్దీన్, లయన్స్ జిల్లా గ్లోబల్ మెంబర్ షిప్ కోఆర్డినేటర్ రవి ప్రకాష్, అధిక సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Arattai