NANDYAL July07 :- రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఈ నెల 9న బనగానపల్లెలో జరగనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంగళవారం పర్యటన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి సందర్శించనున్న ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను తనిఖీ చేస్తూ, ప్రతి అంశాన్ని నాణ్యతతో, సమయపాలనతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

ఈ సందర్భంగా భారత వాతావరణ శాఖ (IMD) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ రైన్ గేజ్ స్టేషన్ను కలెక్టర్ పరిశీలించారు. గత పదేళ్లుగా నిర్వహణ లేక పనిచేయకుండా ఉన్న ఈ కేంద్రాన్ని జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవతో తిరిగి పనిచేసే స్థితికి తీసుకురావడం జరిగిందని భూగర్భ జల శాఖ డిడి రఘురాం కలెక్టర్కు వివరించారు. ఈ మేరకు భారత వాతావరణ శాఖ అధికారులతో సమన్వయం చేసి, అవసరమైన సాంకేతిక సిబ్బందిని రప్పించి స్టేషన్ను పునరుద్ధరించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆటోమేటిక్ రైన్ గేజ్ స్టేషన్ ద్వారా ఎలాంటి మానవ ప్రమేయం లేకుండానే వర్షపాతం వివరాలు అత్యంత ఖచ్చితంగా నమోదు అవుతాయని తెలిపారు. గతంలో మాన్యువల్ విధానంలో వర్షపాతం కొలిచే పరిస్థితి ఉండగా, ప్రస్తుతం ఆధునిక సాంకేతికతతో రియల్ టైమ్లో వర్షపాతం నమోదై సంబంధిత కేంద్రాలకు చేరుతుందని పేర్కొన్నారు. అధికారులు ఆటోమేటిక్ రైన్ గేజ్ స్టేషన్ పనితీరును కలెక్టర్కు వివరించారు. 200 మిల్లీమీటర్ల ఫనల్ ద్వారా సేకరించిన వర్షపు నీరు టిప్పింగ్ బకెట్లోకి చేరుతుందని, ప్రతి 0.5 మిల్లీమీటర్ల వర్షపాతానికి ఒకసారి బకెట్ టిల్ట్ అవుతుందని తెలిపారు. ఆ టిల్ట్లను మ్యాగ్నెటిక్ స్విచ్ గుర్తించి డేటా లాగర్కు పంపుతుందని, నమోదైన టిప్స్ ఆధారంగా ఆ రోజు కురిసిన వర్షపాతాన్ని అత్యంత ఖచ్చితంగా లెక్కించవచ్చని వివరించారు.
ఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయాలని, సందర్శించే ప్రతి ప్రాంతంలో పరిశుభ్రత, భద్రత, మౌలిక సదుపాయాలు, సాంకేతిక ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.
Arattai