చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్‌కు వివరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
NANDYAL NoV 27:- జిల్లాలో స్పష్టమైన, సక్రమమైన ఓటర్ల జాబితా రూపొందించడానికి సమగ్ర చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌కు వివరించారు. విజయవాడలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎలక్టోరల్ రోల్స్, ఓటర్ మ్యాపింగ్ మరియు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026 సంబంధిత సన్నాహక పనులపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష జరిగింది. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ తో పాటు డీఆర్ఓ రాము నాయక్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితాకు సంబంధించిన ఏ దరఖాస్తులూ పెండింగ్‌లో లేవని తెలిపారు. బూత్ స్థాయి అధికారుల రేషనలైజేషన్ ప్రతిపాదనలను ఇప్పటికే పంపించినట్లు, వాటికి సంబంధించిన బిఎల్ఓ వివరాలన్నీ సమర్పించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎటువంటి బిఎల్ఓ ఖాళీలూ లేవని, ఎన్నికల ఖర్చుల నివేదికను కూడా సీఈఓ కార్యాలయానికి పంపినట్లు తెలిపారు.
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల పనితీరు మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు. రేషనలైజేషన్ అనంతరం ఏర్పాటైన కొత్త పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన బిఎల్ఓల జాబితాను కూడా పబ్లిష్ చేసినట్లు తెలిపారు. తద్వారా, ఖచ్చితమైన ఓటర్ల జాబితా, పారదర్శకతను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో స్వచ్ఛమైన, తప్పులులేని ఓటర్ జాబితా రూపొందించడానికి కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని, ముఖ్యంగా సిమిలర్ ఫోటోలు, మరో ప్రాంతానికి మారినవారి పేర్లు, మరణించిన వారి పేర్లు, ఒకే ఇంటి నంబర్‌పై అధిక సంఖ్యలో ఓట్లు, ఒకే వ్యక్తి పేరుతో అధిక ఓట్లు వంటి లోపాలను పూర్తిగా తొలగించాల్సిందిగా ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా సీఈఓ కూలంకుషంగా చర్చించారు.
Arattai