NANDYAL July 08:- ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, నంద్యాల జిల్లా సంఘం నిర్వహణలో ఈనెల 18, 19వ తేదీలలో నంద్యాల ఎస్బిఐ కాలనీలో ఉన్న రామకృష్ణ పిజి కళాశాలలో రాష్ట్రస్థాయి సీనియర్ చెస్ పోటీలు నిర్వహిస్తున్నారు.ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనే నంద్యాల జిల్లా జట్టు ఎంపిక పోటీలు ఈనెల 11వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా బుధవారం రామకృష్ణ డిగ్రీ కళాశాలలో, నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన, జిల్లా సంఘం కార్యదర్శి రామ సుబ్బారెడ్డి నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్, నంద్యాల జిల్లా చెస్ సంఘం చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్ట్రస్థాయి పోటీల కరపత్రాలు విడుదల చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాలలో జరుగుతున్న సీనియర్ చెస్ పోటీలలో విజేతలుగా నిలిచిన వారు జాతీయ స్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొంటారని తెలిపారు.ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనే నంద్యాల జిల్లా జట్టు ఎంపిక పోటీలను ఈ నెల 11వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఏటా ఒక రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ నంద్యాలలో నిర్వహిస్తున్నామని, నంద్యాలలో జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్ చెస్ పోటీలలో, ఆసక్తి ఉన్న చెస్ క్రీడాకారులందరూ పాల్గొనాలని ఆహ్వానించారు.
జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏపీ చెస్ వెబ్సైట్ ద్వారా క్రీడాకారులు ఎంట్రీలు నమోదు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలు 9010451585 నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సందీప్,మేడా చంద్రశేఖర్, జిల్లా చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి రాజా చక్రవర్తి పాల్గొన్నారు.
Arattai