నేషనల్ హ్యాండ్లూమ్ డే: GRWM వీడియోలు షేర్ చేయండి.. ప్రధాని మోదీ పిలుపు
DELHI Aug06:- ఆగస్టు 7న జరగనున్న జాతీయ చేనేత దినోత్సవం (National Handloom Day) సందర్భంగా దేశ ప్రజలు చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమకు ఇష్టమైన చేనేత వస్త్రాలతో “గెట్ రెడీ విత్ మీ (GRWM)” వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పంచుకోవాలని కోరారు. వీడియోలను పోస్ట్ చేసే సమయంలో #NationalHandloomDay హ్యాష్‌ట్యాగ్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ప్రధాని మోదీ తన ముందున్న టేబుల్‌పై వివిధ రకాల చేనేత కండువాలను ఉంచి, వాటిలో నుంచి కాషాయ రంగు చేనేత కండువాను ఎంపిక చేసి భుజంపై ధరించారు. భారతీయ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, స్వదేశీ చేనేత ఉత్పత్తులకు ప్రజల ఆదరణ మరింత పెరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Arattai