ఏకశిల అభయాంజనేయ స్వామికి ఆషాఢ మాస అమావాస్య పూజలు
NANDYAL Aug12 :- నంద్యాల జిల్లా పెద్ద దేవలాపురంలోని ఏకశిలా అభయాంజనేయ స్వామికి బుధవారం ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి ఆకు పూజలు,అభిషేకాలు చేశారు.సాయంత్రం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు,భజనలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు శివరాజ్ యోగి,రవితేజ తెలిపారు.అర్ధరాత్రి 2 గంటలకు మహా మంగళహారతి జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు భారీగా ఆలయానికి చేరుకొని స్వామిని దర్శించుకున్నారు.
Arattai