నంద్యాల కళారాధన నటుడు ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్ నటించిన “పళ్ళ బురుసు” సినిమా
NANDYAL Aug12 :- నంద్యాల వాసి, కళారాధన సాంస్కృతిక సంస్థ నిర్వాహక కార్యదర్శి, ప్రముఖ రంగస్థల, టీవీ, సినీ నటులు, నంది,కళా రత్న,కందుకూరి రంగస్థల రాష్ట్ర స్థాయి పురస్కార గ్రహీత ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్ ముఖ్యమైన పాత్రలో అన్నపూర్ణ స్టూడియోస్ తరపున అక్కినేని నాగార్జున నిర్మించిన “పళ్ళ బురుసు” సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదలవుతున్నది.

సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్ నటించారు.నాలుగు దశాబ్దాలుగా రంగస్థల నటుడు గా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ రెండు సంవత్సరాలుగా టీవీ సీరియల్లలో, సినిమాలలో నటించడం ప్రారంభించారు.

తెలంగాణ ప్రాంత గ్రామీణ వాతావరణం లో, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో, హాస్యం, భావోద్వేగాలు కలిపి రూపొందించిన ఈ చిత్రం విజయవంతం కావాలని కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదనరావు డాక్టర్ రవి కృష్ణ ఆకాంక్షిస్తూ, నంద్యాల వాసి నటించిన ఈ సినిమాను నంద్యాల ప్రజలు, కళాకారులు చూసి ఎస్ ఆర్ ఎస్ ప్రసాద్ ను అభినందించాలని కోరారు.నంద్యాలలో ఈ సినిమా శుక్రవారం నుండి నిధి సినిమా థియేటర్లో మార్నింగ్ షో, మెట్నీ షో లు గా ప్రదర్శిస్తారని తెలిపారు.


Arattai