హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజలల్లో విస్తృత అవగాహన కల్పించాలి : జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా
NANDYAL Aug11 :-నంద్యాల, ఆగస్టు 10 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆరోగ్య కరదీపికను డీఎంహెచ్ఓ డా.వెంకటరమణ, డిస్టిక్ లెప్రసి హెచ్ఐవి టీబి కంట్రోల్ అధికారి డా.శారదా బాయి తో కలిసి ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్.. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు హెచ్ఐవీ పరీక్షలు, కౌన్సెలింగ్, సకాలంలో చికిత్స పొందేలా ప్రజలను చైతన్య పరచాలని జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా అధికారులను ఆదేశించారు.అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు రెండు నెలల పాటు జిల్లాలో హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన మరియు ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.హెచ్ఐవీ వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలు, హెచ్ఐవీ పరీక్షలు, కౌన్సెలింగ్, ప్రారంభ దశలో చికిత్స, లైంగిక సంబంధ వ్యాధుల నివారణ తదితర అంశాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించాలన్నారు.గర్భిణీలకు హెచ్ఐవీ, సిఫిలిస్ పరీక్షలను ప్రోత్సహించి, తల్లి నుంచి బిడ్డకు సంక్రమణను నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.హెచ్ఐవీతో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్ష చూపకుండా ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు.1097 జాతీయ ఎయిడ్స్ హెల్ప్‌లైన్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలని, అవసరమైన వారు అందుబాటులో ఉన్న ఆరోగ్య సేవలను వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.రెండు నెలల పాటు వారానికి ఒక ప్రత్యేక అంశాన్ని తీసుకుని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని వైద్య అధికారులను ఆదేశించారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సరైన అవగాహనతో అపోహలు మరియు వివక్షను తొలగించేందుకు కృషి చేయాలని తెలిపారు.
Arattai