భూటాన్ అంతర్జాతీయ ‘గోల్ఫ్ షాట్ బాల్’ పోటీలకు ఎంపికైన నంద్యాల జిల్లా విద్యార్థులు
NANDYAL Aug11 :-భూటాన్ దేశంలో ఆగస్టు 23 నుండి 27 వ తేదీ వరకు జరగనున్న అంతర్జాతీయ ‘గోల్ఫ్ షాట్ బాల్’ (Gold Short Ball) గేమ్స్ పోటీలకు నంద్యాల జిల్లాకు చెందిన ఇద్దరు ప్రతిభావంతులైన విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వారు భూటాన్ వెళ్లనున్నారు.

ఎంపికైన విద్యార్థుల వివరాలు:
1.కుమారి జగదీశ్వరి: 9వ తరగతి, ఎం.జి.పి.ఎ.పి బి.సి వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (గర్ల్స్), నంద్యాల.
2.మిస్టర్ ఎన్. తేజా నాయక్: 10వ తరగతి, కాకతీయ హైస్కూల్, కలవబుగ్గ.
ఆర్థిక సహాయం & ప్రోత్సాహం:
ఈ అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు అయ్యే ప్రయాణ ఖర్చులు మరియు ఇతర చార్జీల నిమిత్తం ఒక్కో విద్యార్థికి రూ. 50,000 (యాభై వేల రూపాయల చొప్పున) ఆర్థిక సహాయం (ఫైనాన్షియల్ సపోర్ట్) అందించడం జరుగుతోంది.
అంతర్జాతీయ స్థాయిలో మన జిల్లా మరియు రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసేలా రాణించాలని కోరుతూ ఈ విద్యార్థులకు జిల్లా అధికారుల మరియు పాఠశాల ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Arattai