నంద్యాల పట్టణంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
NANDYAL Aug29 :- నంద్యాల పట్టణంలోని స్పటిక లింగేశ్వర ఆలయం నందు నిర్వాహకులు యోగానంద ఆధ్వర్యంలో శ్రావణ మాస రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఉదయం స్పటిక లింగేశ్వరునికి,అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు

.రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని నీకు నేను రక్ష,నువ్వు నాకు రక్ష,మనందరం దేశానికి రక్ష అనే సందేశంతో భక్తులు, నిర్వాహకులు ఒకరికొకరు రక్షాబంధన్ కట్టుకున్నారు.లోక కళ్యాణార్థం గాయత్రి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాంధీ అనిల్ వెంకటేశ్వర్ రెడ్డి, రఘునాథ రెడ్డి ,యోగ సభ్యులు పాల్గొన్నారు
Arattai