NANDYAL May12:- నంద్యాలలో ఉన్న మధుమణి చెవి ముక్కు గొంతు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో, ఐఎంఏ నంద్యాల సహకారంతో యువ చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులకు ఆధునిక ఈ ఎన్ టి చికిత్స విధానాలలో శిక్షణ ఇవ్వడం కోసం ఒక సంవత్సరం ఫెలోషిప్ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఒక సంవత్సరానికి ఒక్క సీటు మాత్రమే అవకాశం ఉంటుంది.
గత సంవత్సరం కాలంగా ఈ ఫెలోషిప్ కోర్స్ శిక్షణ పొందిన ఈవో ఈఎన్టీ వైద్యురాలు డాక్టర్ సురేఖకు మధుమణి ఆసుపత్రి సమావేశ భవనంలో నిర్వహించిన సర్టిఫికెట్ ప్రదాన ఉత్సవంలో ఫెలోషిప్ సర్టిఫికెట్ ని మధుమణి ఆసుపత్రి నిర్వాహకులు ప్రముఖ చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు డాక్టర్ చిత్తలూరి మధుసూదనరావు, ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన రావు మాట్లాడుతూ మధుమణి చెవి ముక్కు గొంతు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో క్లిష్టమైన శస్త్ర చికిత్సలు నిర్వహించడానికి అత్యంత ఆధునికమైనటువంటి పరికరాలు, ఆధునిక స్టీల్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేసి అత్యున్నత ప్రమాణాలతో వైద్య చికిత్సలు అందిస్తున్నామని, ఇక్కడున్న వసతులతో యువ చెవి ముక్కు గొంతు వైద్యులకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారు వివిధ ప్రాంతాలలో అక్కడ ఉన్న ప్రజలకు మెరుగైన ఉన్నత స్థాయి వైద్యం అందించడానికి ఆస్కారం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ ఫెలోషిప్ కోర్సులను ప్రారంభించామని తెలిపారు. ఫెలోషిప్ శిక్షణ పొందే వారికి నెలకు 50వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నామని, గతంలో తమ ఆసుపత్రిలో ఈ కోర్సులో 35 మంది శిక్షణ పొంది వివిధ ప్రాంతాలలో తమ వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.
డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యంత ఆధునిక చెవి ముక్కు గొంతు చికిత్సల వసతులు ఉన్న ఆసుపత్రుల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచే మధుమణి నంద్యాల ఆసుపత్రిలో యువ వైద్యులకు చెవి ముక్కు గొంతు శస్త్ర చికిత్సలలో మెలకువలు నేర్పించడం, తద్వారా శిక్షణ పొందిన వారు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఉత్తమ సేవలు అందించడానికి దోహదపడుతున్నారని మధుమణి ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ మధుసూదనరావు, ప్రముఖ చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు డాక్టర్ చిత్తలూరి మణిదీప్, డాక్టర్ రోహిత్ లను అభినందించారు.
డాక్టర్ చిత్తలూరి మణిదీప్ మాట్లాడుతూ ఉన్నతస్థాయి ప్రమాణాలు కలిగిన అత్యాధునిక పరికరాలు, వసతులతో నగరాలలోని కార్పొరేట్ స్థాయి వైద్యం నంద్యాల స్థాయి వ్యయంతో అందిస్తున్నామని, ప్రతి ఏటా నిర్వహించే ఉచిత శస్త్ర చికిత్సల శిబిరం ఈ సంవత్సరం కూడా జూలై నెలలో నిర్వహించబోతున్నామని, వందమంది నిరుపేద రోగులకు ఉచిత శస్త్ర చికిత్సలు చేస్తామని ప్రకటించారు.
ఫెలోషిప్ కోర్స్ పూర్తి చేసిన డాక్టర్ సురేఖ మాట్లాడుతూ ఒక సంవత్సరం కాలంలో చెవి ముక్కు గొంతు శస్త్ర చికిత్సలు ,వైద్య చికిత్సలు అందించడంలో చక్కటి తర్ఫీదును ఇచ్చినందుకు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మధుసూదన్ రావుకు డాక్టర్ మణిదీప్ కు డాక్టర్ రోహిత్ కు ధన్యవాదాలు తెలిపారు.భవిష్యత్తులో ఈ శిక్షణ తాను ప్రాక్టీస్ చేసే ప్రాంతంలో ప్రజలకు మంచి సేవలు అందించడానికి ఉపకరిస్తుందని, ప్రజలకు ఉన్నత స్థాయి వైద్యం అందుబాటులో ఉన్న వ్యయంతో చేయాలన్నదే తన ధ్యేయం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మధుమణి ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ మధుసూదన రావు, డాక్టర్ రవి కృష్ణ,నంద్యాల గైనకాలజీ వైద్యుల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ నాగమణి, , నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి,డాక్టర్ చిత్తలూరి మణిదీప్,డాక్టర్ రోహిత్, మధుమణి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Arattai