ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
NANDYAL April14:- నంద్యాల పట్టణంలోని PSC & KVSC ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ వై దస్తగిరి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడులను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ డాక్టర్ వై దస్తగిరి మాట్లాడుతూ భారతదేశానికి అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు భారతదేశానికి పరిపాలనలో భాగంగా రాజ్యాంగాన్ని నిర్మించడంలో అంబేద్కర్ యొక్క పాత్రను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ దేశానికి అంబేద్కర్ ఎంతో సేవ చేశారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాసులు,విజయానంద్,అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.
Arattai