NANDYAL April14:- మంగళవారం భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా స్థానిక కళారాధన కార్యాలయంలో నంద్యాల లయన్స్ క్లబ్, కళారాధన తరపున అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.
నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు, కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ పోరాట యోధుడు, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్ రావ్ అంబేడ్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించిన మేధావి అని కొనియాడారు. సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాటం చేశారని అన్నారు.

విద్యను అభ్యసించు, ఉద్యమించు, నిర్వహించు అని ఉద్యమ నినాదం ఇచ్చారని, కార్మికుల హక్కుల కోసం, మహిళలకు ఆస్తి హక్కు కల్పించడానికి కృషి చేశారనీ,బాబా సాహెబ్ అంబేద్కర్ మనకు కేవలం రాజ్యాంగం మాత్రమే ఇవ్వలేదు,ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికే ధైర్యం ఇచ్చారనీ, ఆయన కోరుకున్న సమ సమాజాన్ని నిర్మించడానికి మన వంతు కృషి చేయడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
ఈరోజు నంద్యాల పట్టణ నడిబొడ్డులో పురపాలక కార్యాలయంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడం హర్షనీయమని, అంబేద్కర్ విగ్రహం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్, సభ్యులు మేడం చంద్రశేఖర్, రామయ్య, కళారాధన సభ్యులు నారాయణరెడ్డి, పృద్వి, కార్యాలయ కార్యదర్శులు మధు, సూర్య పాల్గొన్నారు.
Arattai