ఆగస్టు 22వ తేదీ న నంద్యాల జిల్లాస్థాయి చెస్ పోటీలు
NANDYAL Aug18 :- నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఎన్ ఆర్ జి ఎస్ అకాడమీ నిర్వహణలో ఈనెల 22వ తేదీన నంద్యాల ఎన్జీవోస్ కాలనీలో ఉన్న అచీవర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నామని నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ, కార్యదర్శి రామ సుబ్బా రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పోటీలు 12 వివిధ వయసు విభాగాల్లో వేరువేరుగా జరుగుతాయని తెలిపారు. టోర్నమెంట్ కోఆర్డినేటర్ గా అచీవర్స్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ వ్యవహరిస్తారని అన్నారు.జిల్లా స్థాయిలో జరిగే పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన వారికి ఒక్కొక్క క్యాటగిరి లో 10 ప్రైజ్ ల చొప్పున మొత్తం 120 ప్రైజ్ లను ఇవ్వడం జరుగుతుందన్నారు.ఆసక్తి ఉన్న చెస్ క్రీడాకారులు ఏపీ చెస్ వెబ్సైట్ ద్వారా ఈనెల 21 వ తేదీ సాయంత్రం లోపు ఎంట్రీలు నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9010451585 నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు.
Arattai