పర్యాటక మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులు
NANDYAL; Aug19 :- భారత పర్యాటక శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలచే సంయుక్తంగా నిర్వహించబడుతున్న తిరుపతి లోని “స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ క్యాటరింగ్ టెక్నాలజి మరియు అప్లైడ్ న్యూట్రిషన్ నందు 2026-27 సంవత్సరమునకు ఈ క్రింద తెలిపిన హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము.
- బి.యస్.సి (హెచ్ & హెచ్.ఎ) 3 సంవత్సరాల డిగ్రీ కోర్సుకు ఇంటర్ పాసైన వారి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము. ఈ కోర్సులో F & B Production, F & B Service, Front Office & Housekeeping నేర్పించి 4నెలలు ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్స్ లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వబడును.
- క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ & పెటిసరి (CCFPP)కోర్సుకు యస్.యస్.సి. పాసైన వారి నుండి దరఖాస్తులు కోరుచున్నాము. ఈ కోర్సులో ఒక సంవత్సరము పాటు దేశ విదేశాల వంటకములు నేర్పించి 6నెలలు ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్స్ లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వబడును.
- సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫుడ్ & బేవరేజ్ సర్వీస్ కోర్సుకు యస్.యస్.సి పాసైన వారి నుండి దరఖాస్తులు కోరుచున్నాము. ఈ కోర్సులో ఐదు నెలల పాటు రెస్టారెంట్ మరియు బార్ సర్వీస్ నేర్పించి 1 నెల ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్స్ లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వబడును.
పై కోర్సులకు వయో పరిమితి లేదు
ఈ కోర్సులు పూర్తి అయిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ హోటల్లు, మరియు ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ల లలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడును.
బ్యాంక్ లోన్ సదుపాయం కలదు.
బాల బాలికలకు వేరు వేరుగా హాస్టల్ సదుపాయం కూడా కలదు.
ఈ సంస్థ యొక్క దరఖాస్తులు మరియు ఇతర ఏదైనా సమాచారం కొరకు సెల్ నెం. 9701343846, 9100558006 & 9700440604. అనే నెంబర్లను సంప్రదించవలెను. website: www.sihmtpt.org.
పూరించిన దరఖాస్తులను 29.08.2026 లోపు కాలేజికి పంపించవలెనని డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్, నంద్యాల APTDC Dr. A. సునీల్ కన్నా గారు ఒక ప్రకటన లో పేర్కొన్నారు ఈ కార్యక్రమం లో K శివరామకృష్ణ అడ్మిషన్ I/C and S.భార్గవి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పాల్గొన్నారు.
Arattai