రాష్ట్రస్థాయిలో రాణిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల NCC విద్యార్థులు
NANDYAL; Aug19 :- నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల NCC విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నారని కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా రాజధాని అమరావతిలో యూత్ రెడ్ క్రాస్ కంటిన్జెంట్ ప్లాటున్ కి నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి గురువర్ధన్ నాయకత్వం వహించడం నంద్యాలకే గర్వకారణం అన్నారు.గురువర్ధన్ తో పాటు రామాంజనేయులు,యేసు రాజు లు ఈ కవాతులో పాల్గొనటం విశేషం అన్నారు

అలాగే నంద్యాల జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కళాశాల ఎన్సిసి విద్యార్థులు 28 మంది పాల్గొని జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారని తెలిపారు. కమాండర్ సి రంగస్వామి ఈ ప్లాటును కి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో క్యాడెట్లు అందరిని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ శశికళ , వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శైలజ రాణి, ఎన్సిసి అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.

Arattai