లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
NANDYAL; Aug19 :- బుధవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నంది కేబుల్ లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వాసు, ఈనాడు దినపత్రిక నంద్యాల ఫోటోగ్రాఫర్ మురళి లకు లయన్స్ క్లబ్ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు.

లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ అంతర్జాతీయ సంస్థ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ డాక్టర్ జి.రవికృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జరుగుతున్న చరిత్రను భవిష్యత్తు తరాలకు నిక్షిప్తం చేసి కళ్ళ ముందు నిలిపే గొప్ప కళ ఫోటోగ్రఫీ అన్నారు. వాసు నంది కేబుల్ లో న్యూస్ ఎడిటర్ గా, ఫోటోగ్రాఫర్ గా, మురళి సుదీర్ఘకాలంగా ఫోటోగ్రాఫర్ గా, ప్రస్తుతం ఈనాడు దినపత్రిక నంద్యాల ఫోటోగ్రాఫర్ గా పాత్రికేయ రంగంలో విశిష్ట సేవలు చేశారని కొనియాడారు. నంద్యాలలో ఉన్న ఫోటోగ్రాఫర్లు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలోలయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్,జోనల్ చైర్మన్ సోమేశుల నాగరాజు, నంద్యాల లయన్స్ క్లబ్ కార్యదర్శి మేడా చంద్రశేఖర్, కోశాధికారి సురేష్ సభ్యులు ఎం.పి.వి.రమణయ్య,తోట శ్రీనివాసులు,శివరాం రెడ్డి,రామయ్య,ప్రసాద్ ,తదితరులు పాల్గొన్నారు.
Arattai